మీ internet explorer యొక్క టైటిల్ బార్ మీద రెగ్యులర్ గా వుండే internet explorer బదులు మీ పేరు లేదా మీకు ఇష్టమైన పేరు రావలనుకొంటే ముందుగా start లోని Run కమాండ్ క్లిక్ చేయండి. అప్పుడు వచ్చే బాక్స్ లో gpedit.msc అని క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చే విండోలో user configuration క్లిక్ చేయండి. ఆ తరువాత వచ్చే విండోలో windows settings క్లిక్ చేయండి. ఆ తరువాత వచ్చే విండోలో Internet Explorer Maintainance క్లిక్ చేయండి. ఆ తరువాత వచ్చే విండోలో Browser User Interface క్లిక్ చేసి Browser టైటిల్ ను క్లిక్ చేయండి.
ఆ తరువాత వచ్చే విండోలో ఉన్న Customaize Title Bar చెక్ బాక్స్ ను క్లిక్ చేసి క్రింద ఏదో ఒక్క పేరు ఇవ్వండి. ఇప్పుడు మీ gpedit.msc ను క్లోజ్ చేయండి.
మరలా start లోని Run కమాండ్ క్లిక్ చేయండి. అప్పుడు వచ్చే బాక్స్ లో regedit అని క్లిక్ చేయండి.
HKEY_CURRENT_USER\Software\Microsoft\Internet Explorer\Main లోకి రండి. ఇందులో
window title ఎక్కడ ఉందో చూసి దానిని క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చే బాక్స్ లో మీకు కావలిసిన పేరు (ఈ పేరే మీ టైటిల్ బార్ మీద వస్తుంది). ఇవ్వండి. ఇప్పుడు మీ regedit క్లోజ్ చెయ్యండి. ఇప్పుడు మీ ఇంటర్నెట్ ఎక్సప్లోరర్ ఓపెన్ చేస్తే టైటిల్ బార్ మీద మీ పేరు వస్తుంది.